calender_icon.png 10 October, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

09-10-2025 08:39:39 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో జగన్నాథం సతీష్ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురుని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.23,400 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. మండల పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.