09-10-2025 08:44:31 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాజాధికార పార్టీ(టీఆర్పి) కరీంనగర్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా కొత్తపల్లికి చెందిన గుర్రం నితిన్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పది జిల్లాల్లో సోషల్ మీడియా కన్వీనర్లను నియామకం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం సూచన మేరకు పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆమోదంతో నియమించడం జరిగిందని మనోజ్ తెలిపారు. తన నియమాకానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్నకు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ మనోజ్ కుమార్కు నితిన్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.