09-10-2025 08:56:38 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నగర సమితి చెంచల మురళి మాట్లాడుతూ స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం పోరాడి ప్రజా సమస్యల పరిష్కారం నిరంతరం పోరాడి ప్రజా పోరాటాలే శ్వాసగా జీవించిన చేగువేరా నేటి యువతకు ఆదర్శమని వారు కొనియాడారు. నాడు చేగువేరా చేసిన త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నూతన సమాజ నిర్మాణం కోసం ఏఐవైఎఫ్ కార్యకర్తలు అంకితం కావాలని బంగారు తెలంగాణ ఏర్పడాలన్నా భారతదేశం, బంగారు దేశంగా నిలబడాలన్నా దానికి యువతే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, ఆదిత్య, రమేష్ రెడ్డి, స్పందన, అలేఖ్య, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.