calender_icon.png 9 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగులోని జాతర లడ్డు, పులిహోర వేలం ముగింపు

09-10-2025 04:56:04 PM

కొబ్బరికాయల వేలం వాయిదా..

జాతర ఈవో బిల్ల శ్రీనివాస్..

రేగొండ (విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 3 నుండి 10వ తేది వరకు 7 రోజుల పాటు జరిగే శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలకు వేలం పాటలు గురువారం ప్రారంభించారు. తిరుమలగిరి గ్రామ పంచాయితీ వద్ద దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవిత ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించినట్లు జాతర ఈవో బిల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. వేలంలో లడ్డు ,పులిహోరకు రూ.20,8,000 లక్షలు వచ్చాయని గతేడాది కన్నా ఈ సారి రూ.5000 హెచ్చు పాట వచ్చినందున లడ్డు, పులిహోర వేలం ముగిసినట్లు ఈవో అన్నారు.

కొబ్బరికాయల వేలానికి గతేడాది కన్నా తక్కువ పాటలు రావడంతో కొబ్బరికాయల వేలం పాటను వాయిదా వేసినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, జాతర గౌరవ పర్యవేక్షకులు గంగుల రమణారెడ్డి,మాజీ చైర్మన్ రొంటాల వెంకటస్వామి,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్, జాతర అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు,మాజి ఎంపీటీసీ గంట గోపాల్,నాయకులు కట్ల మధుసూధన్ రెడ్డి,పల్నాటి శ్రీను,ఆకుతోట తిరుపతి, మంతెపురి తిరుపతి, రొంటాల రఘుపతి,అశోక్,తదితరుల పాల్గొన్నారు.