18-11-2025 12:00:00 AM
ఇల్లెందు, నవంబర్ 17(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా, అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు శబరీష్ లను అరెస్ట్ చేశారు.
గత నెలలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా ఒక రేషన్ షాపును తనిఖీ చేసి స్టాక్ తక్కువ గా ఉందని కేసు నమోదు చేశారు. ఆ సమయంలో షాపును సీజ్ చేశారు. ఆ షాప్ తిరి గి ఇచ్చేందుకు రూ 30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
విజయ్ అనే అసిస్టెం ట్ ద్వారా డబ్బులు అడిగించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శబరిష్ ద్వారా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా, అసిస్టెంట్ విజయ్, శబరిష్ లను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.