calender_icon.png 18 November, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రివైజ్ హౌస్ ట్యాక్సుల పేరుతో వేధింపులు

18-11-2025 12:00:00 AM

 ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బీజేపీ కార్పొరేటర్లు 

ఎల్బీనగర్, నవంబర్ 17 : హౌస్ ట్యాక్స్ రివైజ్ పేరుతో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్ స్పెక్టర్లు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ భయపెడుతున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ కి బీజేపీ కార్పొరేటర్లు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ... రివైజ్ పేరుతో రెసిడెన్షియల్ హౌస్ ట్యాక్స్లను పెంచడంతో సాధారణ కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సరైన అధ్యయనం లేకుండా, స్థల పరిశీలన చేయకుండా అధికంగా పన్నులు విధించడంతో ప్రజలపై భారం పడుతుందన్నారు. చిన్న వ్యాపారులు ఇళ్ల వద్ద పెట్టుకునే సాధారణ బోర్డులకే కమర్షియల్ ట్యాక్స్ వేయడం పూర్తిగా అన్యాయం అని తెలిపారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా  హౌస్ ట్యాక్సులు పెంచడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని స్పష్టం చేశారు.

అక్రమంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత రెసిడెన్షియల్ ట్యాక్సులను రివైజ్ చేయకుండా, ట్యాక్స్ విధానం పారదర్శకంగా, ప్రజలపై భారంలేకుండా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, చింతల అరుణ, సురేందర్ యాదవ్, నాయికోటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.