calender_icon.png 7 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి

07-07-2025 12:34:13 AM

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్

ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విధానం పై స్పష్టమైన వైఖరిని చెప్పకపోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. లాల్ బహుదూర్ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున ఖర్గే  ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ లో  భాగంగా బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ పై ప్రకటన చేస్తారని బీసీలు ఆశించారన్నారు.

ఈ మేరకు ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన బీసీ సంఘం నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ కానీ కనీసం స్థానిక బీసీ రిజర్వేషన్ల పై కాంగ్రెస్ అధినాయకులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. మరొక వైపు బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఉదరగొట్టి కనీసం పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదని, బీజేపీ నిజ స్వరూపం తెలిసిన బీసీ నాయకులు ఎవ్వరు కూడా బీజేపీని నమ్మలేదన్నారు.

ఇకపై బీజేపీ పార్టీ పై బీసీలకు నమ్మకం లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పు డు 34 శాతం ఉన్న స్థానిక రిజర్వేషన్లు కాస్తా 18 శాతంగా పంచాయతీ ఎన్నికల్లో, జిల్లా పరిషత్, మండల పరిషత్తు మున్సిపల్ కార్పోరేషన్స్ ల్లో 22 శాతానికి పరిమితం చేసి ఉన్న రిజర్వేషన్ల సిస్టమ్ ను తుంగలో తొక్కి నేడు స్థానిక ఎన్నికల్లో  బీసీ రిజర్వేషన్స్  బీఆర్‌ఎస్ పార్టీ ముసలి కన్నీరు కార్చడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీహరి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దాసరి మూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పెంట అజయ్ పటేల్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు మట్టా రాజు యాదవ్ బీసీ యువజన సంఘం అధ్యక్షులు పొగుల సైదులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నగౌడ్ నారగౌడ్, రాజగౌడ్, లవ కుమార్  తదితరులు పాల్గొన్నారు.