17 March, 2026 | 8:40 AM

చండూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

17-03-2026 12:39 AM

చండూరు, మార్చి 18 : చండూరు మున్సిపాలిటీలలో ఆదివారం సాయం త్రం రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికుల కథనం ప్రకారం కస్తాల క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఒక కూడలిల్లో యువకుల మధ్య మాట మాట పెరిగి వివాదం మొదలైంది.

అది  కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది. యువకులు గుంపులుగా విడిపోయి బహిరంగంగానే ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం అంతా రణరంగంగా మారింది. ఈ గొడవ వల్ల చుట్టుపక్కల దుకాణదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

దాడికి మున్సిపల్ ఎన్నికలే కారణం..

ఈ దాడికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలే కారణమని తెలుస్తుంది. చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 1వ వార్డు నుండి బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్ధిగా దోటి కిరణ్ బరిలో నిలిచారు.అయితే ఈ వార్డులో బిఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆదివారం సాయంత్రం దోటి కిరణ్ అతని స్నేహితులు ఓ టీస్టాల్ వద్ద ఉండగా చండూరు టౌన్ కి చెందిన బెల్లంకొండ వినయ్, మొగుదాల రవి ఇంకా కొంత మంది కలిసి మున్సిపల్ ఎన్నికల్లో మాకు పోటీగా నీవు ఏలా నిలబడుతావు అంటు దోటి కిరణ్ అతని స్నేహితులు సంగెపు నరేష్, దోటి శివ,

భీమనపల్లి గణేష్, సామ రాజు, దోటి నరేష్, ఇడికూడ మోహన్ల పై దాడి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఒకరికి తలపై గాయమైందని, ఒకరికి పన్ను విరిగిందని విరిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై దోటి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.