17 March, 2026 | 2:01 AM

పది రోజుల్లోనే పరిష్కారం!

17-03-2026 12:40 AM
  1. సిరిసిల్ల జిల్లా పెద్ద లింగాపూర్‌లో కాలువ నిర్మాణానికి నిధుల కేటాయింపు
  2. కృతజ్ఞతగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చిత్రపటానికి ప్రజల క్షీరాభిషేకం

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కెనాల్ సమస్యకు 10 రోజుల్లో పరిష్కారం చూపిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు రైతులు కృతజ్ఞతగా చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సిరిసిల్ల జిల్లా పెద్ద లింగాపూర్ ప్రాంతంలో సం వత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కాలువ నిర్మాణ సమస్యపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పది రోజుల క్రితం స్పందించి, నిరసన శిబిరానికి చేరుకుని రైతులతో మాట్లాడారు.

అక్కడి నుంచే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫోన్ చేసి సమస్య తీవ్రతను వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే సమస్యపై నివేదిక అందించాలని అధికారులను ఆదేశించా రు.

మల్లన్న చొరవతో ప్రభుత్వం స్పందించి కేవలం పది రోజుల్లోనే కాలువ పనులను పూర్తి చేయాలని అధికారికంగా సాంక్షన్ లెట ర్ జారీ చేయడంతో పెద్ద లింగాపూర్ పరిసర ప్రాంతాల 12 గ్రామాల రైతులకు భారీ ఊరట లభించింది. రూ.3 కోట్ల పైచిలుకు నిధుల కేటాయించారు. దీంతో సోమవారం పెద్ద లింగాపూర్ రైతులు తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు చెపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మల్లన్న హామీ మేరకు నిధులు విడుదల కావడంతో ఆదివా రం టీఆర్పీ జిల్లా నేతలు రైతులకు ని మ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింప చేశారు.