calender_icon.png 17 December, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్దుతండలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల ఘర్షణ

17-12-2025 04:06:52 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండ పోలింగ్‌ కేంద్రం వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన ఒక ఓటరును కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. దీనిని బీఆర్ఎస్ వర్గీయులు వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో కేంద్రం వద్ద కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బందోబస్తు పెంచి పోలింగ్‌ ప్రక్రియను పునః ప్రారంభించారు.