17-12-2025 05:25:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేసి విజయం సాధించగా వారిని బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. సర్పంచ్ ఎన్నికలలో రేషన్ డీలర్లు ఇర్ల లక్ష్మి చిన్నయ్య(ఆలూర్), గుర్రం రాము(కడ్తాల్) సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా వారిని నిర్మల్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పతికే రాజేందర్ ప్రధాన కార్యదర్శి షేక్ మౌలానా డీలర్లు పోలా శ్రీనివాస్, గండ్రత్ ప్రవీణ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.