04-08-2025 01:48:26 AM
బాన్సువాడ, ఆగస్టు 3: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మ రోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డా యి. మంత్రి సీతక్క పర్యటనలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి, ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేసి, భారీ బం దోబస్తు నడుమ మంత్రి సీతక్క పర్యటనను కొనసాగించారు.
కామారెడ్డి జిల్లా చందూర్, మోసా మండలాల్లో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఉ మ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క వచ్చారు. చందూరు మండలంలో గ్రా మ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ఏనుగు రవీందర్‌రెడ్డి కార్యకర్తలతో వెళ్లారు. మంత్రి సీతక్క భవనాన్ని ప్రారంభించి లోపలికి వెళ్లగా.. ఏనుగు రవీందర్‌రెడ్డిని పోచారం వర్గీయులు గ్రామపంచాయతీ భవనంలోకి రాకుండా అడ్డుకుని, తలుపులు మూసి వేశారు.
దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోచారం జిందా బాద్ అంటూ ఆయన వర్గీయులు.. ఏనుగు రవీందర్‌రెడ్డి జిందాబాద్ అంటూ ఈయన వర్గీయులు నినాదాలు చేయడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
ఇరువర్గాల మధ్య తీరా వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఏనుగు వర్గంపై అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతింప జేశారు. ఆ తర్వాత భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంత్రి సీతక్క పర్యటన కొనసాగింది.