04-08-2025 03:54:54 PM
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో 6.58 లక్షల బంగ్లాదేశ్ కరెన్సీ 'టకా'తో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు బిఎస్‌ఎఫ్ సోమవారం తెలిపింది. వివరాల్లోకి వెళితే... బీఎస్‌ఎఫ్ 102 బెటాలియన్ సిబ్బంది శనివారం ఘోజదంగా సరిహద్దు అవుట్‌పోస్ట్ ప్రాంతం నుండి ఆ వ్యక్తిని పట్టుకున్నట్లు బిఎస్‌ఎఫ్ వెల్లడించింది.
విచారణ సమయంలో ఆ కరెన్సీని తనకు స్థానికుడు ఇచ్చాడని, సరిహద్దు అవతల వేచి ఉన్న బంగ్లాదేశ్ వ్యక్తికి దానిని అందజేయాల్సి ఉందని, అందుకు అతనికి రూ.500 చెల్లిస్తారని బిఎస్‌ఎఫ్ కి చెప్పాడు. ఆ వ్యక్తిని వివరంగా ప్రశ్నించడం వల్ల ఈ స్మగ్లింగ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభించాయని, వారు సరిహద్దు ఆవల చురుకైన నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నారని అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడి నుంచి బంగ్లాదేశ్ కరెన్సీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు బిఎస్‌ఎఫ్ పేర్కొంది.