calender_icon.png 4 August, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలాపూర్ రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

04-08-2025 04:32:18 PM

హనుమకొండ,(విజయక్రాంతి): కమలాపూర్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది 2019 లో  అంబాల  గ్రామ శివారులో 789, 790, సర్వే నెంబర్లలో తప్పుడు పత్రాలు సర్వే రిపోర్ట్ లతో చేసిన రెవెన్యూ అధికారులపై హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... బోళ్ల సందీప్ అనే వ్యక్తి అధికారులను తప్పు దోవ  పట్టించి నకిలీ సర్వే రిపోర్ట్ లు చేసి చుట్టుపక్క రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని.

సందసాని వెంకటేశ్వర్లు కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. నకిలీ సర్వే రిపోర్టు తయారుచేసిన ఆర్.ఐ వి.ఆర్.ఓ లపై చర్యలు తీసుకోవాలని.. హనుమకొండ ఆర్డిఓ కు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నట్టు నకిలీ సర్వే  రిపోర్ట్ తో కోర్టును ఆశ్రయిస్తున్నట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో రైతులపై కేసులు పెడుతూ బోళ్ల సందీప్ అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. 

2015 సంవత్సరంలో బండి నాగేశ్వరవు ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సమయంలో నకిలీ పాస్ పుస్తకాలు తయారుచేసిన బోళ్ల సందీప్ మరియు కొంతమంది అధికారులపై విచారణ అనంతరం 2022లో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అమాయక రైతులను ఇబ్బందుల గురిచేస్తున్న అంబాల గ్రామానికి చెందిన బోల్ల సందీప్ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఆర్డీవో సమక్షంలో వీలైనంత త్వరలో నకిలీ సర్వే రిపోర్టులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.