calender_icon.png 4 August, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రావి చెట్టు వేప వృక్షానికి పెళ్లి

04-08-2025 04:23:45 PM

అశుభాలు తొలగి శుభాలు జరుగుతాయని గ్రామస్తుల నమ్మకం

గద్వాల జిల్లా చెన్నిపాడు గ్రామంలో వింత ఆచారం

అలంపూర్: సాధారణంగా పెళ్లంటేనే అబ్బాయి అమ్మాయి ఇరువురికి ఒకరినొకరు నచ్చి ఇరు కుటుంబాల సమ్మతితో వేదమంత్రాలు భాజా భజంత్రీల నడుమ వివాహాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారు. ఎక్కడ చూసినా ఇలాంటి ఆచార వ్యవహారాలే వివాహ వేడుకలో కనిపిస్తాయి. కానీ ఇలాంటి వివాహ వేడుకనే గ్రామస్తులు రావి చెట్టుకు వేప వృక్షానికి  జరిపించారు. ఈ వింత వివాహ ఆచారం గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో సోమవారం  జరిగింది.

ఈ వివాహ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. అయితే వివాహం గురించి గ్రామస్తులను అడగగా గ్రామంలో అశుభాలు తొలగి శుభాలు కలుగుతాయని గ్రామస్తులు తెలిపారు. అంతేకాక రావి చెట్టు వేప వృక్షానికి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని వారు కూడా సంతానయోగం కలుగుతుందని , పెళ్లి కానీ యువతీ యువకుల కూడా  ఓ ఇంటి వారవుతారని నమ్మకం గ్రామస్తులు తెలిపారు. వివాహ కార్యక్రమ అనంతరం భక్తులకు గ్రామస్తులు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.