04-08-2025 04:02:25 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగితే చంపుతానని బెదిరిస్తున్నాడని మనస్థాపనకు గురైవ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణానికి చెందిన పంజాల కృష్ణ అలియాస్ (కిట్టు) అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొనిఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... వనం హరీష్ అనే వ్యక్తికి పంజాల కృష్ణ 25 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపారు.
అప్పు ఇచ్చి 15 నెలలు గడిచినప్పటికీ హరీష్ అప్పు చెల్లించకపోవడంతో చంపుతానని బెదిరించాడని తెలిపారు. కృష్ణ బయట వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకురావడంతో వాళ్లు ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. దీనితో మనస్థాపనకు గురైన కృష్ణ హై స్కూల్ క్రీడా మైదానంలో సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడుతూ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నా చావుకు కారణం వనం హరిషేననిసెల్ఫ్ వీడియోలో తెలిపాడు.స్థానికులు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.