calender_icon.png 4 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రజాహిత యాత్ర.. ప్రజలను నట్టేట ముంచే యాత్ర

04-08-2025 04:28:05 PM

బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఎద్దేవా

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర ప్రజలను నట్టేట ముంచే యాత్రనని, దీంతో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో ఇచ్చిన గ్యారంటీలు, హామీలన్నీ ఎగవేసినట్లేనని ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ పాదయాత్ర చేపట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ లను గోదావరిలో కలిపేయాత్రగా ఈ యాత్ర కొనసాగిందని దీనిని పార్టీ పోరుయాత్ర అని అంటే బాగుండేదని అన్నారు. ఈ యాత్రకు ప్రజల్లో ఎటువంటి స్పందన కనిపించలేదు.

ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటివరకు ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదని ,అభయ హస్తం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మల్లికార్జున కరిగే ప్రజలకు ఆరు గ్యారెంటీలను ప్రకటించారని తులం బంగారం, 4000 పెన్షన్ ,మహిళలకు ఇస్తామన్న 2500, కౌలు రైతులకు రైతు భరోసా, ఉపాధి కూలీలకు 12000 ,ఆటో డ్రైవర్లకు 12000, ఇలాంటి అనేక హామీలు తుంగలో తొక్కేసినట్టేనని ఆయన విమర్శించారు.