29 July, 2026 | 12:47 AM

రైతు వేదిక పరిశుభ్రం

29-07-2026 12:00 AM

కేసముద్రం జులై 28, (విజయక్రాంతి): అధ్వానంగా రైతు వేదికలు, అందరూ వినియోగిస్తారు, ఆలనా పాలనా పట్టించుకోరు అనే శీర్షికతో విజయక్రాంతి పత్రికలో ప్రచురించిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం కేసముద్రం మండల పరిషత్ ఆవరణలోని రైతు వేదిక పరిసరాలను మున్సిపల్ సిబ్బంది చేత శుభ్రం చేయించారు. ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఇదే తరహాలో అధికారులు స్పందించి మంచినీటి నల్ల కనెక్షన్ సరిచేసి, నీటి వసతి కల్పించి టాయిలెట్లను వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.