15-10-2025 01:11:40 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వెంకటేశం అన్నారు. సీతాఫల్ మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1 ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు మంగళవారం పోచారం మున్సిపల్ కొర్రెములలో “స్వచ్ఛ భారత్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని వీధులు, ప్రజా ప్రదేశాలను శుభ్రపరిచారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, స్వచ్ఛతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందనే సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి. వెంకటేశం నాయకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈకా ర్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు నవీన్ కుమార్, దీపక్, ఖలీల్, మహాలక్ష్మి, అరుణ, సౌజన్య, పూజ, భార్గవి, సందీప్, భువనేశ్వరి, స్నేహ, సంధ్య, దివ్య గ్రామస్థులు మరియు కళాశాల సిబ్బంది డాక్టర్ కిషోర్, శ్రావ్య, రామకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు.