18 April, 2026 | 2:32 PM

పటాకుల విక్రయాలకు అనుమతి తప్పనిసరి

15-10-2025 01:09 AM

శామీర్ పేట్ , అక్టోబర్ 14: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలోపటాకుల దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని జినోమ్ వ్యాలీ సీఐ గురువయ్య తెలిపారు. అక్టోబర్ 16లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పండుగనుసంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవలన్నారు.