calender_icon.png 8 November, 2025 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

08-11-2025 07:10:21 PM

ఏర్గట్ల,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా మండల కేంద్రం ఏర్గట్లలో కాంగ్రెస్ పార్టీ మండల యువజన సంఘం అధ్యక్షుడు దానం గంగమోహన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను స్థానిక బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వసతి గృహం విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గంగామోహన్  మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు విద్యార్థులతో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.