calender_icon.png 8 November, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయ చెక్కు అందజేత..

08-11-2025 07:10:18 PM

సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి

కొనరావుపేట: మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన పునిగోటి మనోహర్ రావు  అనే వ్యక్తి గతంలో విద్యుత్ షాక్ ప్రమాదం వలన మరణించగా సెస్ సంస్థ ద్వారా మృతుడు పునిగోటి మనోహర్ రావు భార్య పునీగోటి సుష్మకి శనివారం రోజు ఆర్థిక సహాయంగా సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి 5 ఐదు లక్షల చెక్కును ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సెస్ ప్రతినిధులు రఘురాములుగౌడ్,మామిళ్ల అంజయ్య,పెద్ది వెంకటేశం, జలగం అరవిందరావు, సకినేని మధుసూదన్ రావు, ఐలేని సంపత్ రావు, దేవయ్య, తిరుపతి, ముత్తయ్య, శ్రీనివాస్,సంజీవ్,సెస్ ఏఈ దివ్య, లైన్ ఇన్స్పెక్టర్ వైకుంఠం,లైన్మెన్ శ్రీనివాస్,శ్రావణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.