08-11-2025 07:14:15 PM
కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో శ్రీ చైతన్య విద్యార్థులు ఆరు బంగారు పతకాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ శాతవాహన యూనివర్సీటీ రెండో స్నాతకోత్సవంలో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు 6 బంగారు పతకాలు అందుకోని విశేష ప్రతిభను చాటుకొన్నారని తెలిపారు.
విద్యాసంస్థలకు చెందిన పి. శ్రీనివాస్ కు యాద సురయ్య స్మారక బంగారు పతకం, జవేరియా సుల్తానాకు దివంగత గుంటి సుగుణ మోమోరియల్ బంగారు పతకం, కొండమీది సాయిప్రసన్ కు చీటి హన్మంతరావు స్మారక బంగారు పతకం, తోడేటి శ్వేత కు రెండు విభాగాలలో బంగారు పతకాలు లభించి తెలిపారు. విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, శ్రీ చైతన్య డిగ్రీ, పిజి కళాశాలల ప్రిన్సిపల్స్ యస్. క్రిష్ణారెడ్డి, డా. వి. స్వర్ణలత, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గోన్నారు.