calender_icon.png 29 January, 2026 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కప్ మండల క్రీడా పోటీలు ప్రారంభం

29-01-2026 03:39:34 PM

జైనుర్ జనవరి 29 (విజయ క్రాంతి): జైనూర్ మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కే.విశ్వనాథ్ ప్రారంభించగా,సీఐ రమేష్,తహసీల్దార్ అడా బిర్సావ్,స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో ప్రతిభను వెలికితీసుకుని రాష్ట్ర,జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.పోటీలను క్రమబద్ధంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.క్రీడల ద్వారా స్నేహభావం,క్రమశిక్షణ పెరుగుతుందని అన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.క్రీడాకారులకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు,అధికారులు,యువకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.