27-07-2025 12:27:44 AM
- ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదల
- సెప్టెంబర్ 9న టోర్నీ ప్రారంభం.. 28న ఫైనల్
దుబాయ్, జూలై 26: ఆసియా కప్ 2025కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) శనివా రం విడుదల చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌కు యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వర కు జరగనున్న టోర్నీలో గ్రూప్ భార త్, పాకిస్థాన్, ఒమన్, యూఏఈ ఉండగా.. గ్రూప్ శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ ఉన్నాయి.
ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్.. సెప్టెంబర్ 14న తలపడనున్నాయి. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనుండగా.. గ్రూప్ దశలో 15మ్యాచ్‌లు.. సూపర్ ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలు ఇంకా ఖరారు చేయలేదు.