calender_icon.png 25 October, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కు పనులను పరిశీలించిన సీఎం

25-10-2025 12:39:42 AM

కాన్వాయ్ ఆపి జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రేవంత్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పర్యటనలతో ప్రజలను, అధికారులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. శుక్రవారం ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ మార్గమధ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో కాన్వాయ్‌ను ఆపి, నిర్మాణంలో ఉన్న జీహెఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు రోహిన్‌రెడ్డితో కలిసి పార్కు మొత్తం కలియతిరిగారు.

గతంలో చెత్తాచెదారంతో నిండి, కబ్జాకు గురయ్యే ప్రమాదంలో ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడి, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కు గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకోవడంతో, పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా పార్కులో పనిచేస్తున్న కూలీలను సీఎం ఆప్యాయంగా పలుకరించారు. ముఖ్యమంత్రే స్వయంగా వచ్చి తమను పలుకరించడంతో కూలీలు ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అం దుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షిం చాలని ముఖ్యమంత్రి సూచించారు.