25-10-2025 12:40:56 AM
టేకులపల్లి, అక్టోబర్ 24,(విజయక్రాంతి): గంజాయి పట్టుబడ్డ కేసులో ఐదుగురు వ్య క్తులను అరెస్టు చేసినట్లు ఇల్లందు డీఎస్ పీ ఎన్.చంద్రభాను టేకులపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. టేకులపల్లి ఎస్త్స్ర రాజేందర్ తమ సిబ్బంది తో కలిసి శుక్రవారం టేకులపల్లి ఏరియా లో పె ట్రోలింగ్ చేయుచుండగా టేకులపల్లి - కొత్తగూడెం హైవే రహదారిలో సమ్మక్క-సారల మ్మ గద్దెల వద్ద 5 గురు వ్యక్తులు పోలీసు వా హనం చూసి పారిపోతుండగా పట్టుకొని వా రిని విదారించారు. వారు తడబడుతు వారి వద్ద గంజాయి ఉన్నదని ఒప్పుకున్నారని తెలిపారు.
అయిదుగురు వ్యక్తుల నుండి మొత్తం 0.531 గ్రాముల గంజాయి (విలువ రూ. 26,550 నాలుగు సెల్ ఫోన్ లు, ఒక మో టార్ సైకిల్ నెంబర్ ఏపీ 20 క్యూ 3152, రూ.1500 స్వాధీన పర్చుకున్నట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మం డలం, జగన్నాధపురంకు చెందిన బానోత్ కు మార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరిసీతారామరాజు జిల్లా, నెల్లిపాక మండలం, పిచుకు లపాడు గ్రామానికి చెందిన తేజవత్ అనిల్, (ప్రస్తుతం టేకులపల్లి మండలం,
ఏకాలనీ తండాలో నివాసం ఉంటున్నాడు- ఆటో డ్రైవ ర్), టేకులపల్లి మండలం లాచ్యతాండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ జాటోత్ శివ, టేకులపల్లి మండలం బికాలనీ తండా గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గూగులోత్ సాయి, టే కులపల్లి మండలం లాచ్యతాండాకు చెందిన లారీ మెకానిక్ గూగులోత్ వినాయక్ @ సి ద్ధూ లుగా గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్త్స్ర రాజేంద ర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.