calender_icon.png 13 January, 2026 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో క్యాలెండర్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

13-01-2026 10:16:40 AM

- డి ఎ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన టీజీవో జిల్లా అధ్యక్షులు విజయకుమార్ 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టిజిఓ అసోసియేషన్ న్యూ ఇయర్ 2026,డైరీ, వాల్ క్యాలెండర్, అట్టహాసంగా ఆవిష్కరించారు. ప్రభుత్వం ను  నడుపుతున్నది ఉద్యోగులేనని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు తక్కువ గా ఉంటారని ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడుపుతున్నది ఉద్యోగులేనని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, బి.శ్యామ్,  మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సందన విజయ్ కుమార్ ముదిరాజ్, కార్యదర్శి కె.వరప్రసాద్, వివిధ జిల్లాల అధ్యక్షలు,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. డి ఎ ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి  మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సందన విజయ్ కుమార్ ముదిరాజ్, కార్యదర్శి కె.వరప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరో ఐదు డిఏలతో పాటు పిఆర్సి ని కూడా ప్రభుత్వం అందించాలని విన్నవించారు.