calender_icon.png 29 October, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుశేఖర భారతీ తీర్థస్వామిని కలిసిన సీఎం

29-10-2025 01:10:10 AM

శంకర్‌మఠ్‌లో మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని నల్లకుంట శంకర్‌మఠ్‌లో శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారిని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విధుశేఖర భారతీ తీర్థస్వామి శంకర మఠానికి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడకు వెళ్లి స్వామిజీ దివ్య ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారికి సమగ్రంగా వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి శంకర్‌మఠంలోని గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం వెంట విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.