29-10-2025 04:53:36 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్వహించగా మొత్తం 46 మంది పోలీస్ సిబ్బంది ఈ పోటీలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ముగింపు వేడుకల్లో బహుమతులను అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.