calender_icon.png 29 October, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐక్యత చాటాలి

29-10-2025 04:51:51 PM

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి 

బత్తుల లక్ష్మీనారాయణ

చొప్పదండి (విజయక్రాంతి): పటేల్ స్పూర్తితో ఐక్యత చాటాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. ఈనెల 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించే యూనిటీ మార్చ్ ప్రోగ్రాంని విజయం కోసం చొప్పదండి రూరల్ శాఖ అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతదేశంలోని 560 సంస్థానాలను ఒక జెండా కిందికి తెచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నారు. 

యువతలో ఐక్యత స్ఫూర్తిని నింపే విధంగా పలు కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని అదేవిధంగా అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అన్ని గ్రామాల్లో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజాం నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించినటువంటి గొప్ప నేత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గొల్లగట్టయ్య తాజా మాజీ ఎంపీటీసీ తోట కోటేష్ తాజా మాజీ సర్పంచ్ గుంట రవి, జడ్పిటిసి కన్వీనర్ సింగిరెడ్డి భూమిరెడ్డి మాజీ ఉపసర్పంచ్ బైరబోని కిట్టు గౌడ్, విలాసాగరం అంజయ్య, జొంగోని తిరుపతి గౌడ్, ఎడ్ల సురేష్, గుండె వెంకటేష్, కాదాసి అఖిల్, గాండ్ల వేణు, ఎడవల్లి రాజారాం ,కాయిత సాయి, రాపల్లి శ్రీనివాస్, తాళ్ల పెళ్లి రవి, సింగ సాని నరేష్, మొగిలి శంకర్, తమ్ముడి రాజు తదితరులు పాల్గొన్నారు.