29-10-2025 04:55:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ ఈనెల 30న నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దిగంబర్ పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విద్యార్థులకు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.