calender_icon.png 29 October, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుందుభి వాగులో కొట్టుకుపోయిన గొర్రెల మంద..!

29-10-2025 04:46:19 PM

వందకుపైగా గొర్రెలు మృతి..

తీవ్రంగా నష్టపోయిన గొర్రెల కాపరులు..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. దుందుభి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా తాదూరు మండలం ఇంద్రకల్, ఇతోల్, సిర్సవాడ, గోవిందాయపల్లి గ్రామాల గొర్రెల మంద మేతకోసం వెళ్లి వాగు ఉధృతికి వాగులో కొట్టుకుపోయాయి. సుమారు ఐదు మంది గొర్రెల కాపరులకు చెందిన సుమారు వందకు పైగా గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. గొర్రెల కాపరులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.