29-10-2025 04:38:20 PM
ఈ రోడ్డు వెంటే కాలువలు తలపించేలా నీటి ప్రవాహం..
రాకపోకలకు అంతరాయం..
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రభుత్వ అలసత్వం, రోడ్లు, భవనాల శాఖ, నేషనల్ హైవే అతారింటి నిర్లక్ష్యం కారణంగా నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డు(చీమలగడ్డ) ఫ్లైఓవర్ ఇరువైపులా నిర్మించిన సర్వీస్ రోడ్డు గుంతలమయంగా ప్రమాదాలకు నిలయంగా మారింది. కురిసిన వర్షాలకు తిప్పర్తి రోడ్డు ఫ్లై ఓవర్ రోడ్డు వెంటే కాలువలు తలపించేలా నీరు ప్రవహిస్తుంది. ఆ రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. ఎక్కడ ఏ గోతు ఎంత లోతు ఉందో అంచనా వేయలేని పరిస్థితి చాలామంది ప్రయాణికులు ప్రమాదాలకు గురై గాయాలపాలయ్యారు. భారీ వాహనాలు గోతుల్లో దిగి దెబ్బతిన్నాయి. దీంతో ఈ రహదారింటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూర్చి.. రోడ్డుపై నీరు ప్రవహించకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.