calender_icon.png 29 October, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఏసీబీకి చిక్కిన సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్

29-10-2025 04:36:09 PM

కుంట్లూరులోని అపార్ట్ మెంట్ లో మీటర్ల రిలీజ్ కోసం లంచం డిమాండ్

రూ. 6వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో గల సబ్ స్టేషన్ లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత కొంతకాలంగా పెద్ద అంబర్ పేట్ సబ్ స్టేషన్ లో సీనియర్ లైన్ ఇన్సెక్టర్ గా ప్రభులాల్ పనిచేస్తున్నారు. కుంట్లూరులో గల అపార్ట్మెంట్ సంబంధించిన ఇంటి విద్యుత్ మీటర్లను రిలీజ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో ఆ అపార్ట్ మెంట్ యాజమాని ఏసీబీ అధికారులను సంప్రదించగా.. వారు ప్రభులాల్ ను డ్రాప్ చేసి.. రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం పెద్ద అంబర్ పేట్ లోని సబ్ స్టేషన్ లో పట్టుకున్నారు. గతంలో కూడా ప్రభులాల్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు.