18-05-2025 12:16:45 PM
హైదరాబాద్: చార్మినార్(Charminar) పరిధిలోని గుల్జార్ హౌస్(Gulzar House) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నత అధికారులను సీఎం ఆదేశించారు. అగ్నిప్రమాద బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు. అలాగే ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి ప్రమాద కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.