calender_icon.png 18 May, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'ప్రభుత్వ ఉచిత విద్య ముద్దు-ప్రైవేటు పైసల విద్య వద్దు' సాంస్కృతిక అవగాహన

18-05-2025 02:24:53 PM

నాగారం: నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు ఆదివారం నాడు బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బడిలో ఉండవలసిన సమయంలో బయట ఉన్న పిల్లల వివరాలు సేకరించి పాఠశాలలో చేర్పించాలి. పట్టణ, గ్రామీణ విద్య మధ్య అంతరాన్ని తగ్గించవచ్చు.

మన తెలంగాణ రాష్ట్రంలోని పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందిస్తుంది ప్రతి గ్రామంలో "గ్రామ విద్యా రిజిస్టర్" (AER) నిర్వహించే బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలను గుర్తిస్తారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికమైన ఆహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తా ఉంది ఉచిత పుస్తకాలు ఉచిత యూనిఫామ్ లు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.