calender_icon.png 18 May, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక రుణాలు

18-05-2025 11:51:03 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

తుంగతుర్తి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, దాయం రాజిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఝాన్సీ రాజిరెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం పార్టీ కార్యకర్తలు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా  ఎమ్మెల్యే మందుల సామెల్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డికి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సింగిల్ విండో డైరెక్టర్ పులుగుజ్జ యాకయ్య, వెంపటి మాజీ ఉప సర్పంచ్ భాషబోయిన వెంకన్న, ఎనగందుల మల్లేష్ నేత, కొండగడుపుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.