calender_icon.png 12 October, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సారెస్పీ ఫేస్-2కు ఆర్డీఆర్ పేరు నామకరణం చేస్తాం: సీఎం రేవంత్

12-10-2025 04:11:09 PM

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

ఆస్తుల అమ్ముకొని కార్యకర్తలను కాపాడిన దామన్న

ఆర్డిఆర్ సంతాప సభతో జనసాంద్రంగా మారిన తుంగతుర్తి

గాంధీ కుటుంబానికి విధేయుడు ఆర్డిఆర్

ఆర్డిఆర్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండం తండా

ఆర్ డి ఆర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

తుంగతుర్తి,(విజయక్రాంతి): 40 సంవత్సరాల  సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ లో ఉండి 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు మంత్రిగా, చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, ఎంతోమంది నాయకుల గుండెల్లో చివరి స్థాయిగా నిలిచిపోయిన మహానీయుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తుంగతుర్తి మినీ స్టేడియంలో ఆర్డియర్ సంతాప సభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలోని లింగాలలో పుట్టి కాంగ్రెస్ పార్టీ యువజన శాఖలో కోశాధికారిగా పనిచేసి, అంచెలంచెలుగా ఎదుగుతూ 1985 సంవత్సరంలో తుంగతుర్తిలో మొదటిసారి కమ్యూనిస్టు కంచుకోటపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో నాంది పలికారు. మొత్తం తన 40 ఏళ్ల జీవితంలో 5 పర్యాయాల ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు క్యాబినెట్ మంత్రి హోదాలో పనిచేసి సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉన్న వ్యక్తి దామోదర్ రెడ్డి అనే కొనియాడారు.

ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మందులు సామెల్ రూ.50 వేలు లేకున్నా టిక్కెట్టు పొందిన గెలుపులో కీలకపాత్ర పోషించి, 52 వేల మెజార్టీ సాధించులకు కృషి చేసిన వ్యక్తి ఆర్డీఆర్ అని తెలిపారు. ఎస్సారెస్పీ ఫేస్-2కు ఆర్డీఆర్ పేరు నామకరణం చేయవలసిందిగా రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రతిపాదన చేసి వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురగా తక్షణమే ఆర్డీఆర్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపడంతో సభా ప్రాంగణం కేరింతలతో హోరెత్తించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు వారి కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో రాజకీయంగా అవకాశం వచ్చినప్పటికీ వారి తనయుడు సర్వోత్తమ్ రెడ్డికి అండగా ఉంటామని తెలపడంతో ప్రజల అర్షద్వానాలతో చప్పట్లు కొట్టారు. 1985 నుండి నాటి వరకు ఆస్తులు అమ్ముకొని, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకుడు అని అన్నారు. నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏకై ఎమ్మెల్యేగా ఉండి, కక్షలు రాజకీయాలతో అనేక త్యాగాలు చేసిన వ్యక్తి , మహనీయుడు దామోదర్ రెడ్డి అని అన్నారు.

దామోదర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం...

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాలములో ఎస్సారెస్పీ కాలువల వద్ద రక్తతర్పణం చేసిన ఘనత దామోదర్ రెడ్డి దేనన్నారు. మీ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం ఎస్సారెస్పీ జనాల కోసం పోరాటం చేశారు. 40 సంవత్సరాల సుధీర్ గా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆస్తులు అమ్ముకొని కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ జెండాను కాపాడిన చరిత్ర కూడా దామన్నదేనని పేర్కొన్నారు. ఖమ్మంలో వెంకరెడ్డి, తుంగతుర్తిలో ఆర్డీఆర్ ఇరువురు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కార్యకర్తలకు అండదండగా ఉంటూ చరిత్ర సృష్టించిన వ్యక్తులు అని అన్నారు.

ఆర్డీఆర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

ఆర్డీఆర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరంలోటే అని రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖామంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ జలాల కోసం రక్త దర్పణం చేసిన చరిత్ర దామోదర్ రెడ్డి దేనని కొనియాడారు. ఎస్సారెస్పీ ఫేస్2 ఆర్డిఆర్ పేరు ప్రతిపాదన చేయాలని, ముఖ్యమంత్రిని కోరారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తుల అమ్ముకున్న చరిత్ర దామోదర్ రెడ్డి దేనిని అన్నారు.

నా ఆప్తమిత్రుడు... దామన్న: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు

దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, నాకు వ్యక్తిగతంగా మంచి సోదరుని కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక వ్యక్తిగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అంటే దామన్న, దామన్న అంటే కాంగ్రెస్ గా 40 సంవత్సరాలు జీవితం సాగించాడు. అటువంటి మహానీయుడు కుమారుడైన సర్వోత్తమ్ రెడ్డికి, ఏఐసీసీ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ అండదండగా ఉండాలని కోరారు. అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పదవి ఇవ్వాలని కోరారు.