calender_icon.png 12 October, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్ యార్డుకు పోటెత్తిన ధాన్యం

12-10-2025 04:40:41 PM

ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ కు గత వారం రోజులుగా ధాన్యం పెద్దఎత్తున తరలి రావడం జరిగింది. దీంతో మార్కెట్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు, జెసిబిల సహాయంతో తాలు లేకుండా ధాన్యాన్ని వేరు చేస్తున్న తేమగా ఉన్న ధాన్యాన్ని ఎండబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఎప్పుడు వర్షం వస్తుందని మబ్బుల వైపు గుబులుగా చూస్తూ తన ధాన్యాన్ని వర్షం వస్తే తడవకుండా రోజు పట్టాలతో కప్పి వెళ్లడం కనిపిస్తుంది. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.