08-11-2025 07:28:36 PM
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
రోగులకు పండ్ల పంపిణీ, అన్నదానం
కామారెడ్డి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆలీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్లరాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, ఐరేని సందీప్ , ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిల పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఆసుపత్రిలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పదేళ్లుగా దోపిడీకి గురైన తెలంగాణను గాడిలో పెట్టేందుకు రేవంత్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో మద్దతు పలుకుతున్నారని చెప్పారు.