12-08-2024 12:52:04 PM
హైదరాబాద్: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతీ యువకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ యువత సన్మార్గంలో పయనిస్తూ దేశానికి మార్గనిర్ధేశకులు కావాలని సీఎం ఆకాంక్షించారు. తెలంగాణ యువత రాణించేలా ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్యాచరణ తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం, పెడదారులను నియంత్రిస్తూ క్రీడల పట్ల ఆసక్తి పెంచడం తదితర నిర్ణయాలు అందులో భాగమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.