12-08-2024 12:55:30 PM
ఉక్రెయిన్: యూరప్ లో అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన ఉక్రెయిన్ కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా ఆధీనంలో ఉంది. ఈ ప్లాంట్ లో మాస్కో దళాలే పేళుల్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. వారు కీవ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. మరో వైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని చెబుతోంది. కాగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటుచేసుకోలేదని చెప్పారు.