calender_icon.png 17 August, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి పర్యటన

12-08-2024 12:24:21 PM

హైదరాబాద్: దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన శుభారంభంగా ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కు-జాఉన్ (Koo Ja-eun)తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ (LG Group) వ్యవస్థాపకులైన LS Group కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 

ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో  తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్  ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనుంది. ఎల్ఎస్ గ్రూప్ అధినేతతో ముఖ్యమంత్రి సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు, ఎల్ఎస్ గ్రూప్ సీనియర్ ప్రతినిధులు కూడా ఉన్నారు.