ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్
17-06-2024 03:50 PM
హైదరాబాద్: కరీంనగర్ డిపో ఆర్టీసీ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కరీంనగర్ బస్టాండ్ లో ఆర్టీసీ మహిళా సిబ్బంది గర్భిణీకి కాన్పుచేసింది. చీరెలు అడ్డుగా కట్టి ప్రసవానికి మహిళా సిబ్బంది సహాయం చేసింది. దినపత్రికలో వార్త చూసి ఆర్టీసీ సిబ్బందిని సీఎం అభినందించారు. మీరు సకాలంలో స్పందించడం వల్లే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలోనూ ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని సీఎం తెలిపారు.






