హైదరాబాద్లో భారీ వర్షం
17-06-2024 03:35 PM
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ కొట్టిన మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, ఫిలింనగర్, టోలీచౌకి, రాజేంద్రనగర్, అత్తాపూర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి ఎక్కడి వావానాలు అక్కడ నిలిచిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.






