calender_icon.png 11 May, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ డిఫెన్స్ నిధికి సీఎం రేవంత్‌రెడ్డి నెల వేతనం విరాళం

10-05-2025 01:33:58 AM

ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కలిసి రావాలని పిలుపు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ పవిత్ర లక్ష్యంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యేలు, నాయకులను కోరారు.

నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం విరాళం గా ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చిం చి ఒక నెల వేతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతాన్ని విరాళంగా ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు. 

డిప్యూటీ కలెక్టర్లు ఒక రోజు వేతం విరాళం 

సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు నే షనల్ డిఫెన్స్ ఫండ్స్‌కు ఒక రోజు వేత నం విరాళం ఇవ్వనున్నట్లు  తెలంగాణ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అ సోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధా న కార్యదర్శి భాస్కరరావు పేర్కొన్నారు.