10-05-2025 01:22:45 AM
చర్ల, మే 9: తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం మావోయిస్టు పార్టీ అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మెజార్టీ రాజకీయ పార్టీలు మావోయిస్ట్ పార్టీకి, ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ చేస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టికొని ఆరు నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామ ని లేఖలో పేర్కొన్నారు.
చర్చల ప్రక్రి య రాష్ట్రంలో, దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొ చ్చేందుకు కాల్పులు విరమిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా మావోయిస్టులు లేఖల ద్వారా కాల్పులు విరమణ ప్రకటించాలం టూ తెలియజేస్తున్నా, దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు కాల్పులు ఆపాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. మావోయిస్టులు లొంగిపోవాలని జన జీవన స్రవంతిలో కలిసి జీవించాలని పలు పథకాలను రూపొంది స్తుందే తప్ప కాల్పుల విరమణకు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.