24-07-2024 04:30:20 PM
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం తీర్మాణాన్ని బీజేపీ వ్యతిరేకించింది. అమృత్ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.3500 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. టెండర్లుప్రక్రియ లేకుండానే పనులను మిత్రలకు ఇచ్చాకున్నారని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ కింద రూ, 15 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని ఏలేటీ వెల్లడించారు. బీజేపీ 8 సీట్లు గెలిచిందనే అక్కసుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమఖ్యా వ్యవస్థలో ఇలాంటి తీర్మానం సరికాదని సూచించారు., అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.