calender_icon.png 1 December, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కలిసిన నూతన డీసీసీ అధ్యక్షురాలు దేవిప్రసన్న

01-12-2025 12:27:32 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవిప్రసన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే తెల్లం ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, పార్టీని నమ్ముకుని కష్ట పడ్డ ప్రతి ఒక్కరు అధిష్టానం దృష్టిలో ఉన్నారని, గత పదేళ్లు ప్రతిపక్ష పాత్రలో మహిళలను ఏకం చేసిన పోరాటాలను ఎవరు మర్చిపోలేదని, పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలన్నారు.

ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతం కోసం మరింత కఠినంగా శ్రమించాలని సూచించారు. 2029లో రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రిగా చూడాలంటే ప్రతీ కార్యకర్తను చైతన్యవంతం చేస్తూ, సమిష్టిగా కష్టపడి పనిచేయాలని దేవి ప్రసన్న ను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, ఐఎన్టియూసి వైస్ ప్రెసిడెంట్ పితాంబరం, మాజీ కౌన్సిలర్ పరమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్మూర్తి, కల్లూరి సంపత్, కాంగ్రెస్ నాయకులు మాజీ ఏఎంసి చైర్మన్ రాంబాబు, జయప్రకాష్, ఆంతోటి పాల్, జానీభాయ్ మరియు తదితరులు పాల్గొన్నారు.